అక్కినేని నట వారసుడుగా నాగార్జున ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నాగార్జున.. ప్రస్తుతం టాలీవుడ్ మన్మధుడుగా క్రేజీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచిన నాగ్ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తనదైన నటనతో సత్తా చాటుకుంటున్నాడు. అంతేకాదు ఇప్పటికీ అమ్మాయిల మనసులు నవ మన్మధుడుగా ఉండిపోయిన నాగ్ ఫ్యామిలీ సినిమాలో నటించి ఎంతోమంది మహిళలను మెప్పించాడు. అయితే దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో మొదట నాగార్జునకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలు కారణంగా విరిపోయారు. తర్వాత శివా, నిర్ణయం, చిన్నబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమెతో ప్రేమలో పడ్డ నాగ్.. అమలను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అమల నాగార్జున కంటే ముందే తమిళ్ హీరో కార్తీక్ తో ప్రేమలో పడిందంటూ ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. కార్తీక్, అమల ఇద్దరు కలిసి ఘర్షణ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూట్ టైంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసని.. కేవలం అమలా, కార్తీక్ దగ్గర స్నేహితులుగా మాత్రమే అందరూ భావించేవారని టాక్. అయితే ప్రాణంగా ప్రేమించుకున్న వీరిద్దరి మధ్యన బ్రేకప్ కారణమేంటో.. ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆమల తమిళ్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి కేవలం తెలుగు ఇండస్ట్రీకి పరిమితమైంది. అలా అప్పటి యంగ్ హీరో నాగార్జునతో ప్రేమలో పడిన అమల.. అతన్ని వివాహం చేసుకొని అఖిల్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కార్తీక్ తో అమల ప్రేమాయణం నడిపింది అన్న వార్తల్లో నిజమెంత తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు నెటింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.