ఈ చిన్నోడిని గుర్తుపట్టారా.. టాలీవుడ్ క్రేజీ హీరో.. సపరేట్ ఫ్యాన్ బేస్.. !

ఈ పై ఫోటోలో పంచకట్టు కట్టుకొని క్యూట్‌గా కనిపిస్తున్న బుడ్డాడు ఎవరో గుర్తుపట్టారా.. అతను ఓ టాలీవుడ్ క్రేజీ హీరో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్నాడు. లవ్, యాక్షన్, క్లాస్, మాస్ ఇలా అన్ని జానర్లలోను తనకు సెట్ అయ్యే విధంగా నటనతో ప్రేక్షకులను మెప్పించి రాణిస్తున్నాడు. అయితే ఈయన కూడా తన కెరీర్‌లో వరుసగా 6 ఫ్లాప్‌లను చెవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ పడకుండా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి దూసుకుపోతున్నాడు. అయితే ఈ హీరో కొన్ని నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్‌కు గురై చావు అంచులు దాకా వెళ్లి తిరిగి వచ్చాడు.

Sai Dharam Tej's Ongoing Film To Be Paused?

అయితే ఇప్పటికీ యాక్సిడెంట్ ఛాయ‌లు ఆయనలో కనిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ స్టెప్పులు అదరగొట్టిన ఈయన.. ప్రస్తుతం సింపుల్ స్టెప్స్‌తోనే ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రోడ్ యాక్సిడెంట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో రూ.100 కోట్లు కలెక్షన్లను రాబట్టిన ఈయన ఎవరో ఇప్పటికే అర్థమై ఉండాలి. ఎస్.. మీ గెస్ కరెక్టే. అతను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరం తేజ్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం నెటింట‌ వైరల్‌గా మారింది. కాగా గతంలో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత తెర‌కెక్కిన విరూపాక్ష, బ్రో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

Sai Dharam Tej: I really loved that heroine

రెండు సినిమాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వ‌సౌళ‌ను కల్లగొట్టాయి. బ్రో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తేజ్.. సంపత్ నందితో సినిమాను అనౌన్స్ చేసినా.. ఆ ప్రాజెక్ట్ ఏవో కారణాలతో అప్డేట్స్ లేకుండా ఆగిపోయింది. అయితే ఈ క్రమంలో మొట్టమొదటిసారి ఓ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు ఈ మెగా హీరో. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోగా సాయి ధరం తేజ్ నటించబోతున్నాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా 2025 లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.