సీనియర్ హీరో కృష్ణంరాజు అండతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. తర్వాత నటించిన సినిమాతోను సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడో అందరికీ తెలుసు. బాహుబలి సినిమా తర్వాత తన సినిమాలతో వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టగల కెపాసిటీ ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ జీవితం ఏమి పూల పాన్పు కాదు. ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చాడు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ తన లైఫ్ చేంజింగ్ మూమెంట్ గురించి ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను రివిల్ చేశాడు.
ఫస్ట్ సినిమా ప్లాప్ అయిందని.. సెకండ్ సినిమా రిలీజ్ కాకముందే మూడో సినిమా, నాలుగో సినిమా కూడా ఫిక్స్ అయ్యాయి అంటూ వివరించాడు. సెకండ్ మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచిందని.. దీంతో రెండు సినిమాల రిజల్ట్స్ చూసిన మూడో సినిమా ప్రొడ్యూసర్ సినిమా చేయలేనంటూ పారిపోయాడని.. అతనికి అసలు నాతో సినిమా చేయడం ఇష్టం లేదు అంటూ వివరించాడు. ఇక నా మూవీస్ వరుసగా ఫ్లాప్ అవడంతో నేను కూడా ఎంతో భయపడ్డా.. ఆ టైంలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశానని వివరించాడు ప్రభాస్.
ఈ క్రమంలో మూడో సినిమాకు చేయాలనుకున్నా.. కథ ఆగిపోయిందని.. నాలుగో సినిమా మూడో సినిమాగా రిలీజ్ అయిందని.. అదే వర్షం మూవీ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో.. ఒకసారిగా నా కెరీర్ మలుపు తిరిగిందని.. ఈ సినిమా నా లైఫ్‌కి మైల్డ్ స్టోన్ అంటూ చెప్పుకొచ్చాడు. వర్షం సినిమా నుంచి నా అసలైన జర్నీ ప్రారంభమైందని.. ఈ సినిమా తర్వాత హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్‌లో వరుస సినిమాలో నటిస్తున్నానంటూ ప్రభాస్ వివరించాడు. ప్రభాస్‌తో సినిమా చేయనని ప్రొడ్యూసర్ పారిపోయిన స్థితి నుంచి.. ఈ రోజు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సైతం తనతో సినిమా చేసే స్థాయికి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలా వర్షం సినిమా ప్రభాస్ లైఫ్‌నే చేంజ్ చేసేసింది.