మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో టైర్ -2 హీరోల్లో స్టార్ హీరో అయ్యాడు. ఇడియట్, నేనింతే, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,వెంకీ, విక్రమార్కుడు, భద్ర, కిక్, దుబాయ్ శీను, బలుపు, రాజా ది గ్రేట్,క్రాక్ వంటి సినిమాలు రవితేజను మాస్ మహరాజ్‌ను చేశాయి.
రవితేజ రీసెంట్‌గా నటించిన రామారావు ఆన్ డ్యూటీ – రావణాసుర – టైగర్ నాగేశ్వరరావు – ఈగల్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేవు. ఇదిలా ఉంటే రవితేజకు మిరపకాయ్ సినిమా ప్రమోషన్స్ లో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగి త్రిష, అనుష్క, శ్రియ, ఇలియానా వంటి హీరోయిన్ల పేర్లు యాంకర్ చెప్పింది.
ఈ ప్రశ్నకు రవితేజ కాస్త ఆలోచన చేసి అనుష్క అని చెప్పేసాడు. అయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో రవితేజ కి అనుష్క అంటే చాలా ఇష్టం అని.. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడన్న పుకార్లు లేపారు. ఇక రవితేజ – అనుష్క కాంబినేషన్లో బలాదూర్, విక్రమార్కుడు వంటి రెండు సినిమాలు వచ్చాయి.