మోక్షజ్ఞ చేయాల్సిన‌ ఆ బ్లాక్ బస్టర్ సినిమా రిజెక్ట్ చేసిన బాలయ్య…!

నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి మూడవ తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి గత కొన్నేళ్ల నుంచి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్న ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పటికే పలు రకాల కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ డైరెక్టర్ మోక్షజ్ఞ ను పరిచయం చేస్తారనే విషయం పైన వార్తలయితే వినిపిస్తున్నాయి.

కొంతమంది మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన హనుమాన్ సినిమాతో మోక్షజ్ఞ ను ఇంటర్ డ్యూస్ చేసి ఉంటే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేదని నటుడుగా మోక్షజ్ఞ కి కూడా మంచి పేరు వచ్చేదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ హనుమాన్ కథను ముందుగా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కే వినిపించారట. కానీ బాలకృష్ణ కు ఎందుకో ఈ సినిమా తన కుమారుడు చేస్తే పెద్దగా ఇంపాక్ట్ చూపించదని ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు కూడా కాస్త ఫైర్ అయినట్లు బాలయ్య పైన వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే ఈ సినిమాని మరో హీరో తేజసజ్జాతో చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన హనుమాన్ చిత్రం 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.. చేజేతులారా వచ్చిన అవకాశాన్ని మోక్షజ్ఞ కు కాకుండా చేశారు తండ్రి బాలయ్య. అందుకే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత బాలయ్య డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కే అప్పచెప్పినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మోక్షాజ్ఞ ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారో చూడాలి.