చిత్ర సీమ పరిశ్రమకు చాలామంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే 50 ఏళ్లకు పైగా తెలుగు చిత్రసీమ పరిశ్రమలో కొనసాగుతున్న సీనియర్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే ఎంతో మంది హీరోయిన్లకు ఇష్టం. ఇక ఈయన దర్శకత్వంలోనే మహేష్ బాబు, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పాటు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
నాటి తరం స్టార్ హీరోయిన్లు అయితే రాఘవేంద్రుడి దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఎంతో ఆరాట పడేవారు. హీరోయిన్ల అందాలను చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే .. అప్పట్లో ఓ సీనియర్ హీరోయిన్ కి రాఘవేంద్రుడు అంటే చాలా క్రష్ ఉండేదట. సదరు హీరోయిన్ ముందు రాఘవేంద్రరావు ఏ హీరోయిన్ అందాన్ని అయినా పొగిడితే ఆమె అస్సలు తట్టుకోలేకపోయేదట.
రాఘవేంద్ర రావు తన ముందే ఏ హీరోయిన్ను అయినా పొగిడితే అస్సలు తట్టుకోలేని ఆ స్టార్ హీరోయిన్ రాఘవేంద్రుడితో అందరి ముందే ఏదో ఒక కారణంతో గొడవకు కూడా దిగేదట. అలా రాఘవేంద్రుడిపై తనకు ఉన్న ఆ క్రష్‌ను ఆమె అలా బయట పెట్టుకునేదన్న గుసగుసలు అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో ఉండేవి.