వావ్.. నాలుగోసారి ఆ హీరోయిన్ తో జతకట్టబోతున్న ప్రభాస్.. మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్‌కు జంటగా నటించే ఛాన్స్ వస్తే బాగుండని ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎవరైనా హీరోయిన్‌కు ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ క్రమంలో ప్రభాస్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే ప్రభాస్‌తో మూడుసార్లు హీరోయిన్గా నటించిన ఓ ముద్దుగుమ్మ నాలుగోసారి ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోతుందంటూ వార్తలు నెటింట‌ వైరల్‌ అవుతున్నాయి.

ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా.. ఆమె టాలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష. ప్రభాస్‌కు మొట్టమొదటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చిన వర్షం సినిమాలో ప్రభాస్.. త్రిషతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ పెయిర్ పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలోను కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్‌గా మంచి రిజల్ట్ అందుకున్న‌ వీరిద్దరికి హిట్ పెయిర్‌గా ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఈమె కూడా మంచి స్టార్‌డంతో కొనసాగుతుంది. ఐదు నుంచి ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో ప్రభాస్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న స్పిరిట్ సినిమా కోసం త్రిషను సెలెక్ట్ చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

నాలుగోసారి త్రిష.. ప్రభాస్ జంటగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు అన్న వార్త నెటింట వైరల్ గా మారడంతో.. అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ వార్త నిజమైతే మరోసారి వీరిద్దరి మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం అంటూ.. సినిమా బ్లాక్ బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమాకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాలోను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించలేదు. మొట్టమొదటిసారి స్పిరిట్ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్న ప్రభాస్‌ని చూడాలని ఆసక్తి అభిమానల్లో నెలకొంది. ఈ క్రమంలో త్రిష కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందని తెలియడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకొని.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.