ఆ ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోస్ రామ్ చరణ్ డై హార్ట్ ఫ్యాన్స్ అని తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ నటవార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అనే స్టేజ్ నుంచి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే రేంజ్‌కి చరణ్ ఎదిగాడు. ఇక చరణ్ కూడా తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. నటన రాదని కేవలం నేపటిజంతోనే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అంటూ ఎన్నో విమర్శలను చెవి చూశాడు. ఇక సుకుమార్ డైరెక్షన్‌లో సమంత, రామ్ చరణ్ జంటగా నటించిన రంగస్థలం సినిమాతో చరణ్ కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ అయింది.

ఈ సినిమాల్లో చెవిటి వ్యక్తిగా చరణ్ జీవించేసాడు. తనదైన నటనతో సత్తా చాటుకున్నాడు. అప్పటి నుంచి రాంచరణ్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్‌చరణ్ ఈ సినిమాలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులతో పాటు.. పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలను కూడా ఫిదా చేశాడట. ఇంతకీ ఆ యంగ్‌ హీరోలు ఎవరో.. ఒకసారి తెలుసుకుందాం. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇక కిరణ్ అబ్బవరం కు రామ్ చరణ్ డై హార్ట్ ఫ్యాన్ అట‌. ఆయన చేసే ప్రతి సినిమాతో పాటు సినిమాల్లో చరణ్ నటించిన రోల్స్ అంటే కూడా కిరణ్ కు చాలా ఇష్టమట.

ఈ క్రమంలో ఓ వేదికపై కిరణ్ అబ్బ‌వరం మాట్లాడుతూ ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని.. ఆయనతో యాక్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వివరించాడు. ఇక కిరణ్‌తో పాటు నటుడు ప్రియదర్శికి కూడా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో ఎప్పుడూ ఆఫర్ వచ్చినా కూడా వదులుకోనని రీసెంట్‌గా జరిగిన ఓ ఇంట‌ర్వ్యూలో ప్రియదర్శి వివరించాడు. రామ్ చరణ్ ప్రతి సినిమా ఆయనకు ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు. ఇలా మొత్తానికి టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్న ఇద్దరు యంగ్ స్ట‌ర్స్ రామ్ చరణ్‌కు డై హార్ట్ ఫ్యాన్స్ అని తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీకి ఇప్పటికి టాలీవుడ్‌లో ఎంతోమంది యంగ్ హీరోస్ అభిమానులుగా ఉన్నారని.. అది నిజంగా గర్వించదగిన విషయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు హీరోలతో పాటు టాలీవుడ్ లో మరికొందరు యంగ్ హీరోస్ కూడా రామ్ చరణ్‌ను ఎంతగానో అభిమానిస్తారు.