అక్కినేని ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. నాగచైతన్య తండేల్ స్టోరీ లీక్.. ఇంతకీ కథ ఏంటంటే..?

అక్కినేని నాగార్జున నటవారసుడిగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలతో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చైతు తన సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదగాలని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన స‌క్స‌స్ లేక డీలా ప‌డిన చైత‌న్య తండేల్‌ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ కొట్టి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ లో ఉన్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అంటూ మొదట్లో వార్తలు వినిపించాయి.

అయితే అదే సమయానికి రాంచరణ్ గేమ్ చేంజ‌ర్‌ సినిమా రిలీజ్ అవుతుందని స‌మాచారం. దీంతో తండేల్‌ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మూవీ రిలీజ్ విషయం పక్కన పెడితే.. సినిమాకు సంబంధించిన పూర్తి స్టోరీని తాజాగా నిర్మాత బన్నీ వాస్ రివీల్‌ చేసేశాడు. ప్రస్తుతం ఇది అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ షాక్ గా మారింది. బన్నీ వాస్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన కొత్త మూవీ ఆయ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తండేల్‌ స్టోరీని వెల్లడించాడు బ‌న్నీ వాప్‌. ఇది ఓ అందమైన ప్రేమ కథ అని చెబుతూనే స్టోరీ మొత్తం లీక్ చేశాడు బన్నీ.

ఇక స్టోరీ విషయానికి వస్తే యదార్ధ గాధ‌ ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమాని 21 జాలర్లు శ్రీకాకుళం, మచిలేశ్వ‌రం నుంచి గుజరాత్ దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి వెళ్తారని.. అయితే ఒకరోజు అనుకోకుండా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు దగ్గరలో ఉన్న పాకిస్తాన్ బోర్డర్స్‌లోకి వెళ్ళి పాకిస్తాన్ సైన్యం ద‌గ్గ‌ర చిక్కుకుంటార‌ని.. అదే సమయానికి కాశ్మీర్లో ఆర్టికల్ 371 రావడంతో మన దేశంపై టెర్రర్ ఎటాక్‌ జరిగి.. తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయ‌ని.. అలాంటి క్రమంలో ఆ జాలర్లు వారి నుంచి ఎలా బయటపడ్డారు.. అనే విషయంపై స్టోరీ నడుస్తుందని చెప్పుకొచ్చాడు బన్నీవాస్. ప్రస్తుతం బ‌న్నీవాస్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవడంతో అక్కినేని ఫ్యాన్స్ బన్నీవాస్ పై ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఏదో కొత్త స్టంట్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.