బ్రహ్మానందం పెద్దకొడుకు ఏడాది సంపాదన ఎన్నికోట్లో తెలుశా.. స్టార్ హీరోలు కూడా బలాదూర్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టార్ కమెడియన్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు బ్రహ్మానందం. ఇక బ్రహ్మానందం నటవరసుడిగా మొద‌ట ఆయ‌న పెద్ద కొడుకు గౌతం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొదట పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా సాంగ్స్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నా కమర్షియల్ గా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన గౌతమ్ హీరోగా మంచి సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో సినిమాలకు దూరమైన గౌతం బిజినెస్లలో రాణిస్తూ.. స్టార్ హీరోలను మించిపోయి ఆస్తులను కూడబెడుతున్నాడట‌. బిజినెస్ పరంగా రాడిస్తున్న గౌతంకు హైదరాబాదులో అధికంగ్‌ కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నట్లు తెలుస్తుంది. వాటిపై వచ్చే ఇన్కమ్ అంతా ఐటి కంపెనీలో పెట్టుబడి పెడుతూ.. వాటి నుంచి కూడా గౌతం భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడ‌ని స‌మాచారం.

అలాగే బెంగళూరులో ప‌దుల సంఖ్యలో రెస్టారెంట్లు కూడా ఉన్నాయ‌ని వాటిదంవారా కూడా భారీ ఆదాయం సంపాదిస్తున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో గౌతమ్ తన బిజినెస్‌ల ద్వారా ఏడాదికి రూ.400 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని.. అంటే నెలకు దాదాపు రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా సంవత్సరానికి రూ.400కోట్ల పైచిలుకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడట. ఇక‌ స్టార్ హీరోల సంపాదన కూడా గౌతం సంపాదన కంటే త‌క్కువ‌గానే ఉంటుంద‌ని టాక్ దీంతో గౌత‌మ్ ముందు స్టార్ హీరోలు కూడా బలాదూర్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.