సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తమ సత్తా చాటాలని ఎంతోమంది నటులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వాళ్లకు అనుకున్న విధంగా పాత్రలు దొరకడం చాలా కష్టం. కొందరు మాత్రం రొటీన్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అదే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూ ఉంటారు. కానీ.. అలాంటి వారి దగ్గరికి ఎక్కువగా వైవిధ్యమైన పాత్రలో నటించే ఛాన్సులు వెళ్తూ ఉంటాయి. ఇక చివరకు ఏం జరిగినా సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. అనేది కీలక పాత్ర పోషిస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళు సాధించే రికార్డులు , విజయాలు అని ఇన్ని కావు. నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో ఎనలేని సేవలను అందించడమే కాదు.. తన సినిమాలతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు.
పౌరాణిక, సాంఘిక, ఆధునిక అని తేడా లేకుండా అన్ని జోనర్‌ల్లో సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. అలా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా తనదైన నటనతో తన సత్తా చాటుతూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్‌గా రాణిస్తున్న తారక్.. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. సినిమాపై కూడా ప్రేక్షకుల మరింత హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునను సంప్రదించగా.. ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో నాగార్జున చేయవలసిన పాత్రకు ఒక కన్నడ ఆర్టిస్ట్‌ను తీసుకున్నారుట మేకర్స్. ఇంతకీ ఆ పాత్రను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
దేవరలో ఎన్టీఆర్‌ను అంటిపెట్టుకొని ఉంటే ఓ కీలక పాత్ర కోసం నాగార్జునను అప్రోచ్ కాగా ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. మొదట కొరటాల శివ ఈ కీలక పాత్ర కోసం నాగార్జునకు కూడా కథను వినిపించాడట. అయితే స్టోరీ బాగున్నా.. తనకు వచ్చిన పాత్ర కూడా నాగార్జునకు ఓకే అనిపించినా పాత్రకు సెట్ అవ్వనని చెప్పి నాగార్జున ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ తో పాటు ఈ పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందట. అందుకే ఆ పాత్రలో మరో తెలుగు హీరో ఎవరైనా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నాగార్జున అయితే దీనికి సెట్ అవుతారని మేకర్స్ అప్రోచ్ అయ్యారట. కానీ నాగార్జున ఈ రోల్ నటించేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో.. కన్నడ నటుడిని సెలెక్ట్ చేసుకుని అతని ఈ సినిమాలో నటింప చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ నటుడు ఎవరు అనే విషయం మాత్రం రివీల్ కాలేదు. అది సినిమా చూసేంతవరకు సస్పెన్స్ కానే ఉండనుందని టాక్.