ఆ హీరోయిన్ల పాలిట అల్లు అర్జున్ పెద్ద ఐరెన్‌లెగ్‌… కెరీర్ నాశ‌నం చేసిప‌డేశాడుగా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు పెసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అదృష్టం లేక ఎంతో మంది హీరోయిన్లు.. ఒకటి రెండు సినిమాలతోనే ఫెడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. అలా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చిన అందరూ హీరోయిన్లు స్టార్ హీరోయిన్గా మారలేకపోయారు. కొందరైతే తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నా.. అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటించిన చాలామంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు తోనే ఫెడవుట్ అవ్వడం గమనార్హం. ఇంతకీ అల్లు అర్జున్ సరసన నటించి ఫేడ్ అవుట్ అయిన ఆ హీరోయిన్‌స్ లిస్ట్‌ ఒకసారి చూద్దాం.

వరుడు :
గుణ శేఖ‌ర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీలో భాను శ్రీ మెహ్ర‌ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ సెలక్షన్‌పై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. దీనికి తగ్గట్టుగానే వరుడు సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో భాను శ్రీ టాలీవుడ్ లో మరోసారి కనిపించలేదు. ఈ సినిమా తర్వాత మరే సినిమాలోను నటించలేదు.

పరుగు :
ఇక బ‌న్నీతో పరుగు సినిమాలో నటించిన షీల ఈ మూవీ తో మంచి సక్సెస్ సాధించింది. తర్వాత ఎన్టీఆర్ అదర్స్‌ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయినా షీలా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది.

బన్నీ :
అల్లు అర్జున్ హీరోగా వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో బన్నీ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన గౌరీ మంజల్ మాత్రం సినిమా సక్సెస్ అయిన అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.

గంగోత్రి :
అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా గంగోత్రి.. రాఘవేంద్ర డైరెక్షన్లో వ‌చ్చిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నా.. అదితి అగర్వాల్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది.

ఆర్య :
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న మూవీ ఆర్య ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే సినిమాల్లో హీరోయిన్గా నటించిన అనురాధ మెహతా కూడా హోమ్లీ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎక్కువకాలం ఇండస్ట్రీలో రాణించలేకపోయింది.