నాగ‌బాబు కంపు కెలుకుడు ప‌నులు చూశారా… ?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు నోటి తుత్త‌ర బాగా ఎక్కువ‌. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌దు. అంతా ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడు నాగ‌బాబు చేసే ప‌నులు అన్నీ పిల్ల చేష్ట‌లు లాగానే ఉంటాయి. తాజాగా నాగ‌బాబు హైదరాబాద్‌లో జరిగిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నంద‌మూరి , అక్కినేని ఫ్యామిలీల‌పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కేలా మాట్లాడారు.

సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు..
మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదే కాదు.. కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదీ అన్నారు. ఇటీవ‌ల కాలంలో కొంద‌రు మెగాఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, వీళ్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు అంటున్నార‌ని.. ఆ వెధ‌వ‌ల‌కు చెపుతున్నా.. మాకు అలాంటి ఫీలింగ్ లేదు.. ఇండ‌స్ట్రీ అనేది మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు.. మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదే కాదు.. కష్టపడి ప్రతిభ చూపించే అంద‌రిది అని చెప్పారు.

నాగ‌బాబు చెప్పిన సూచ‌న మంచిదే అయినా ఇందులోకి సంబంధం లేని నంద‌మూరి, అక్కినేని ఫ్యామిలీల‌ను లాగ‌డం మాత్రం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. నాగ‌బాబు ఇలా లేనిపోని రెచ్చ‌గొట్టే డైలాగుల‌తోనే ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చుపెడుతున్నార‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక నాగ‌బాబు చివ‌రిగా ఇదే ఫంక్ష‌న్లో మాట్లాడుతూ అడివి శేష్‌ తన కష్టంతో ఎదిగాడు. ప్రస్తుతం ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంలో నటించిన ఆర్టిస్ట్‌లు ఎవరు ఏస్థాయికి వెళ్తారో ఎవరు ఊహించలేం… కథల ఎంపికలో అడివి శేష్‌, వరుణ్‌తేజ్‌ నచ్చుతారు. విరూపాక్ష నుంచి మా సాయి తేజ్‌ కూడా నచ్చుతున్నాడ‌న్నారు.