“నేను పిఠాపురంMLA గారి తాలూకా”.. హీరోయిన్ వెరైటీ పొస్ట్ అదుర్స్..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ రాజకీయాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా ఆయన భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఆయన ఫ్యాన్స్ కే కాదు జనాలకు సైతం మంచి ఫీలింగ్ కలుగజేస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి .. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటూ ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలు.. మరోసారి వైరల్ గా మారాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో హంగామా చేసేస్తున్నారు .

పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని గూస్ బంప్స్ స్పీచ్ వీడియోస్ ని ఎడిట్ చేస్తున్నారు . తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది . పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే నెంబర్ ప్లేట్ షేర్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాకుండా మీరు కూడా నా అని నెటిజన్లను ప్రశ్నించింది . ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు చాలామంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ కోరుకున్నారు ..ప్రార్థనలు చేశారు .. పూజలు చేశారు. ఫైనల్లీ అందరి కష్టం ఫలించింది . భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఈ వినింగ్ మూమెంట్ను బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అందుతున్న సమాచారం ప్రకారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నాడు అని తెలుస్తుంది..!!