ఈసారి ఏపీ పాలిటిక్స్ పై సినీ ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో చాలామంది సినీ ప్రముఖులు ఆయనకు సపోర్ట్ చేయడంతో పొలిటికల్ పరంగా కూడా సినీ గ్లామర్ టచ్ నెలకొంది . కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందారు . ఇలాంటి క్రమంలోనే పలువురు హీరోలు.. స్టార్స్ ..నిర్మాతలు ప్రొడ్యూసర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పాలిటిక్స్ కి మీలాంటి ప్రజాసేవకుడే కావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ గెలుపు తధ్యమని భావించిన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆయన గెలుపును ముందుగానే అంచనా వేసి సంచలన పోస్ట్ చేశారు. చివరకు ఆరోజు రానే వచ్చేసింది. పదేళ్ల కల నిజం కాబోయే రోజు ఇది అంటూ పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆయన ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పై ఎంత నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాత్రం చాలా సైలెంట్గా చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కాని పవన్ కళ్యాణ్ చేయి వదల్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రేంజ్ లో గెలిచాడు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా కారణమనే చెప్పాలి. పాజిటివ్ మైండ్ తో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లేలా చేశాడు ఆయన ఫ్రెండ్ త్రివిక్రమ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. ప్రెసెంట్ సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వీడియోస్ మారుమ్రోగిపోతున్నాయి..!!
View this post on Instagram