ఏపీలో ప్రజెంట్ ఎలాంటి సిచువేషన్ నెలకొందో చూస్తున్నాము. మనకు తెలిసిందే. మరికొద్ది సేపట్లోనే ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన రాబోతుంది. ఇప్పటికే ఏపీ సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజభవన్ చేరుకోవడానికి పయనమవుతున్నాడు. రాజ్ భవన్ లో గవర్నర్ కి మర్యాదపూర్వకంగా రాజీనామాలేఖని ఇవ్వబోతున్నారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసం వద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది .
అయితే కనీసం ప్రతిపక్ష హోదా అయిన వైసీపీకి దక్కుతుందన్న ఆశలు జనాలలో పోయాయి . ఇదే క్రమంలో ఒకప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి నోరు మూగబోయింది అంటూ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు .అంతేకాదు పలువురు టిడిపి శ్రేణులు.. టిడిపి తమ్ముళ్లు.. టిడిపిని ఆరాధించి.. అభిమానించే వాళ్ళు గతంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . ప్రచార కార్యక్రమాలలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ..వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోబోతున్నాడు అని సంచలన కామెంత్స్ చేశారు.
“ఆయన పతనం స్టార్ట్ అవుతుంది అని ..గాలికొచ్చిన పార్టీ గాలికి కొట్టుకుపోతుంది అని ..చాలా హుందాగా భారీగా కౌంటర్ వేశారు “..అన్న ప్రకారమే చంద్రబాబు నాయుడు కోరుకున్న విధంగానే గాలికొచ్చిన వైసిపి పార్టీ గాలికి కొట్టుకుపోయే రేంజ్ లో ఫుల్ క్లీన్ స్వీప్ చేసేసాడు చంద్రబాబు నాయుడు . అందుతున్న సమాచారం ప్రకారం 9వ తేదీ నారా చంద్రబాబునాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఏపీ రాజకీయాలలో హాట్ హాట్గా వైరల్ గా మారింది..!!