“ఇప్పుడు చెప్పు..లంగాలు-జాకెట్ లు ఎవ్వరికి పంపాలో అక్క”.. టీడీపీ తమ్ముళ్లు టైం చూసి కొడుతున్నారుగా..!

అయిపోయింది ..కోట్లాదిమంది జనాలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసినా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి . ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది. దానికి సంబంధించి క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్ కూడా కనిపించేస్తుంది . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసిపి నేతలపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. మరి కొద్ది సేపట్లోనే ఏపీ సీఎం గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ చేరుకొని గవర్నర్ కి తన రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు .

ఆ తర్వాత వైఎస్ జగన్ రెడ్డి మాజీ వైఎస్ జగన్ గా మారిపోతున్నారు . ఇలాంటి క్రమంలోనే వైసిపి అధికారంలో ఉంది అని చూసుకుని ఆ పార్టీ నేతలు ఎలా మాట్లాడారో.. మరోసారి ట్రోల్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నాము అంటూ నోటికి వచ్చిన విధంగా కొంతమంది నేతలు వర్ణించలేని పదాజాలంతో టీడీపీ నేతలను.. నాయకులను దూషించారు. మరి ముఖ్యంగా ఓ లేడీ టిడిపి నేతలకు లంగాలు ..జాకెట్లు పంపిస్తాను అని గాజులు వేసుకోమని చాలా నీచంగా ఛండాలంగా మాట్లాడింది .

ఇప్పుడు ఆమె నిటార్గెట్ చేస్తూ టిడిపి ఫ్యాన్స్ ఆమెను పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . “ఇప్పుడు చెప్పు మేము ఎవరికీ పంపించాలి అక్క.. గాజులు – లంగాలు – చెప్పులు – జాకెట్లు ” అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు . సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు అని టైం మారుతూ వస్తుంది అని.. అందుకే నోటి దూకుడు తనం పనికిరాదు అని హెచ్చరిస్తున్నారు . మొత్తానికి వైసీపీ దారుణాతి దారుణంగా ఓడిపోయింది. చాలామంది మంత్రులుగా ఉన్నవాళ్లు ఓడిపోవడం కూడా సంచలనంగా మారింది. ప్రజాతీర్పు పై ఏపీ రాజకీయ విశ్లేషకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి కొత్తగా ఫార్మ్ చేయబోతున్న ఏపీ కూటమి గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తుందో..??