ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఏపీ రాజకీయాలల్లో సంచలనంగా మారింది . మనకు తెలిసిందే.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది . కొద్దిసేపటి క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందారు. ఇప్పటికే జనసైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో వేణుస్వామి పేరు మారుమ్రోగిపోతుంది .
ఎందుకంటే తెలంగాణలో బీఆరెస్ అధికారం చేపట్టబోతుంది అంటూ బాగా కాన్ఫిడెంట్గా చెప్పారు వేణు స్వామి. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయింది. ఏపీలోను జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టబోతున్నారు అంటూ ధీమాగా వ్యక్తం చేశారు ధీమాగా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. అయితే ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది వైసిపి . ఇలాంటి క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే వేణుస్వామి ఇకపై రాజకీయ సినీ సంబంధమైన ప్రిడక్షన్స్ తాను చెప్పబోను అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు .
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏపీలో వైసిపి మరొకసారి 125 సీట్లు వరకు గెలుచుకుంటుంది అంటూ జోష్యం చెప్పారు వేణు స్వామి. రిలీజ్ అయిన ఓట్ల ఆధారంగా ఏపీలో వైసిపి ఎంత దారుణాతి దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు . ప్రస్తుతం విడుదలైన ఫలితాలలో కేవలం 10 – 13 స్థానాలకే పరిమితం అవుతుంది వైసిపి అన్న క్లారిటీ అందరికీ వచ్చేసింది . ఈ క్రమంలోని ఇకపై సిని రాజకీయ సంబంధమైన ప్రిడక్షన్స్ చెప్పబోను అంటూ నిర్ణయం తీసుకున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!
View this post on Instagram