ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేసినా మూమెంట్ రానే వచ్చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపొందారు. దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే అఫీషియల్ ప్రకటన రాబోతుంది. పవన్ కళ్యాణ్ గెలవాలి అని మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురం కి వచ్చి మరి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ మెగా బ్రదర్ నాగబాబు ..నాగబాబు భార్య.. వరుణ్ తేజ్ అదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు .
ఫైనల్లీ జడ్జిమెంట్ డే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 74వేల ఓట్ల మెజారిటీతో వంగ గీతాపై గెలుపొందారు. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఓడిపోతుంది అని ప్రచారం చేశారో వాళ్ళు ఇక నోరులు ముయ్యండి అంటూ ఘాటుగా బదులిస్తున్నారు.
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవరగం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గెలవడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. ఫైనల్లీ విన్నింగ్ మూమెంట్ ఏపీలో కూటమిదే అంటూ క్లారిటీకి వచ్చేసింది..!!