‘ విశ్వంభర ‘ లో నా రోల్ ఇదే.. యంగ్ బ్యూటీ సురభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా ఫేమ్ మల్లిడి విశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ముల్లోకాల నేపథ్యంలో సోషియ ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంద‌ని సమాచారం. ఇక చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌సన సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈమె తో పాటు కొంద‌రు యంగ్ హీరోయిన్స్ కూడా ఈ మూవీలో క‌నిపించ‌న్నునారంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. వారిలో బీరువా, జెంటిల్మెన్, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురభి పూర్ణైక్ కూడా ఒకరు.

🔥💯 Megastar Chiranjeevi Vishwambhara Movie Updates BGM Trending Viral  #shorts #youtubeshorts #short - YouTube

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురభి దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. విశ్వంభర లో ఆమె నటిస్తున్నట్లు వివరించింది. చిరుతో కలిసి నటించడం చాలా థ్రిలింగ్‌గా ఫీల్ అవుతున్నానని.. నా కలలు నెరవేరే క్షణం అంటే ఇదే అంటూ వివరించింది. చిరంజీవి తన వర్క్ గురించి అడిగారని.. నటుడు అనేవాడు బహుముఖంగా ఉండడం చాలా ముఖ్యమని ఆయన తనకు సజెస్ట్ చేసినట్లు వివరించింది. ఇక ఈ సినిమాలో నేను సాంప్రదాయ కట్టుబొట్టుతో హాఫ్ శారీలో కనిపించనున్నానని.. కథ మొత్తంలో కీలకమైన టైంలో వచ్చే చాలా ఇన్ఫ్లుయన్స్‌డ్‌ రోల్ లో నేను నటించబోతున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Surabhi Biography

ఇక రచయితగా, నటుడిగా, దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హర్షవర్ధన్ ఈ సినిమాల్లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా జనవరి 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ యావి క్రియేషన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్‌ అందించడం విశేషం. ఇక చిరంజీవి సెకండెన్నింగ్స్‌ మొదలెట్టిన తరువాత ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య తప్ప మిగతా ఏ సినిమాలు స‌రైన రిజల్ట్ అందించలేకపోయాయి. ఈ క్రమంలో ఆయన కథ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని.. విశ్వంభ‌ర సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చిరు ఉన్నట్లు తెలుస్తోంది.