స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ ని కాకుండా ఉంటే.. ఆ స్టార్ హీరో ని పెళ్లి చేసుకుని ఉండేదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో పెద్ద రాద్దాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం కామన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .

ప్రెసెంట్ వీళ్లు చాలా అన్యోన్యంగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ ప్రపోజ్ చేయకముందే ఓ బడా హీరో ఇంటి నుండి పెళ్లి ప్రపోజల్ వచ్చిందట. కానీ స్నేహ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశారట . సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అబ్బాయ్ వద్దనే వద్దు అనుకున్నాడట . కానీ విధి ఆడిన వింత నాటకంలో మళ్లీ అలాంటి స్టార్ హీరోనే తన ఇంటి అల్లుడుగా మారిపోయాడు .

మొదటి చూపులోనే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ప్రేమలో పడిపోయారు. వీళ్ళ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే . కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ బన్నీ పుష్ప2 సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఈ సినిమా ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. చూద్దాం ఈ సినిమా ఇలాంటి రికార్డ్స్ బద్ధలు కొడుతుందో..?