మరోసారి వికలాంగులకు అండగా నిలబడ్డ శ్రీ లీల.. హల్ చల్ చేస్తున్న వీడియో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో శ్రీ లీలా కూడా ఒకరు. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధమాకాతో సూపర్ హిట్ విజయం అందుకుంది. అనంతరం తిరుగులేని కెరీర్ తో దూసుకుపోయింది. ఇక 2023 మొత్తం ఈ ముద్దుగుమ్మ సినిమాలే ఉన్నాయి అంటే ఈమె క్రేజ్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం ఈమె ఖాతాలో నాలుగు ఫ్లాప్స్ పడడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ తనపై తన డాన్స్ పై నమ్మకంతో మరోసారి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది శ్రీ లీల. ఇక శ్రీ లీల సినిమాలలో నటించి మంచి పాపులారిటీ వచ్చింది కదా అని తన లైఫ్ స్టైల్ ను మార్చుకోకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరితో కూడా సరిగ్గా సంబోధిస్తుంది.

అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ కి 18 ఏళ్లు ఉన్నప్పుడే ఇద్దరి పిల్లలను దత్తత తీసుకుని చదివించింది కూడా. ప్రస్తుతం కూడా వారి పూర్తి బాధ్యతలు శ్రీ లీల శ్రీకరిస్తుంది. ఇక తాజాగా మరోసారి ఓ వికలాంగుల పిల్లవాడిని దత్తతి తీసుకుని తన సంస్కారాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఫేస్ కి ఇంజర్‌ అయి ఉన్న ఓ పిల్లవాడిని ఆడిస్తూ ప్రతి ఒకరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోని చూసిన పలువురు శభాష్ అంటున్నారు.