బ్రేకింగ్.. రాజమౌళికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..?!

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్. ఎస్. కార్తికేయ ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. రాజమౌళి చివరిగా రూపొందించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అన్నడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా జపాన్‌లో రిలీజై ఏడాదిన్నరగా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో రాజమౌళి పాల్గొనేందుకు జపాన్ వెళ్లారు.

అయితే తాజాగా జపాన్ లో భూకంపం సంభ‌వించ‌డం దాని నుంచి రాజ‌మౌళి ఫ్యామిలీ తృటిని తప్పించుకోవ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. కాగా ఈ విషయాన్ని రాజ‌మౌళి కొడుకు కార్తికేయ తన ట్విటర్ వేదికగా వివరిస్తూ ఓ బిల్డింగ్‌లో మేము 28వ అంతస్తులో ఉన్న టైంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని చెప్పుకొచ్చాడు. జపాన్లో భూకంపం ఎలా ఉంటుందో మేము ఇప్పుడే చూసాము. చాలా టెన్షన్ అనిపించింది. అయితే మేము ఎంత కంగారు పడ్డా.. జపానీలు మాత్రం ఎలాంటి భయం బాధ లేకుండా.. వారి పని వారు చేసుకుంటూ.. ఏదో వానజల్లు పడుతుందా అన్నంత తేలికగా రియాక్ట్ అయ్యారని వివ‌రించారు. మొత్తానికి మేమైతే భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రాజమౌళి అభిమానులు రాజమౌళికి ఏదైనా ప్రమాదం జరిగిందా అని మొద‌ట ఆందోళన పడ్డా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాజమౌళి.. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ ఎస్ ఎం బి 29ను పాన్ వరల్డ్ సినిమాగా తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చారు.