బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెర‌కెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన‌ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవ‌రైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజ‌మౌళిని అడిగారట.

Magadheera Re-Release Date: Ram Charan's Blockbuster To Hit Theatres Again  On His Birthday

అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. రెండో సినిమా నేను తప్పకుండా చేస్తా అని వివరించాడట‌. అందులో భాగంగానే మొదట చిరుత సినిమాను తెరకెక్కించారని తెలుస్తుంది. ఆ తర్వాత రాజమౌళి రామ్ చ‌ర‌ణ్‌ను పెట్టి మగధీర సినిమా తీయ‌గా అది అప‌ట్లో ఇండస్ట్రియల్ హిట్గా నిలిచి రికార్డులను క్రియేట్ చేసింది. రామ్‌చరణ్ మార్కెట్‌ను మరింతగా పెంచిందనటంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాకు పట్టుబట్టి మరి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

Talk of the Town: Is that a retort from Allu Aravind to Parasuram?

ఆ టైంలో అల్లు అరవింద్ కొడుకు బన్నీ కూడా హీరోగా ఎదుగుతున్నారు కదా.. ఆయనను వదిలేసి చరణ్ హీరోగా పెట్టి మగధీరను ప్రొడ్యూస్ చేయడం ఏంటి అని కొన్ని కామెంట్స్ వినిపించాయట. అయితే దానిపై ఎటువంటి విధంగా స్పందించని అల్లు అరవింద్.. మగధీర సినిమా చరణ్‌తో చేయడానికి గల కారణాలు మాత్రం చెప్పుకొచ్చాడు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నా అల్లుడిని ఓ వారియర్ గా చూడాలని ఉద్దేశంతోనే ఈ సినిమా కోసం ఎంత ఖర్చైనా సరే పెడతానని రాజమౌళికి చెప్పానని.. అందుకే అప్పు తెచ్చి మరి డబ్బులు పెట్టానని.. అల్లు అరవింద్ పలు సందర్భాల్లో వివరించాడు.