అభిమానులకి బిగ్ సర్ప్రైజ్.. మళ్లీ హోస్ట్ గా మారబోతున్న ఎన్టీఆర్.. ఏ షో కోసం అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హోస్ట్ గా చేయడం పెద్దకొత్తేమి కాదు .. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – నాని – ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎంతోమంది స్టార్ హీరో స్టేటస్ ఉన్నా కూడా బుల్లితెరపై సందడి చేశారు . మరి ముఖ్యంగా హీరోయిన్ రోజా కూడా స్టార్ స్టేటస్ కలిగి ఉన్న ఆమె బుల్లితెరపై ఎలా సందడి చేసిందో మనకు తెలిసిందే. పాన్ ఇండీఅ లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నాక ఏ హీరో కూడా బుల్లితెరపై మెరవడానికి ఇష్టపడరు.

కానీ ఎన్టీఆర్ ప్రతీది డిఫరెంట్గా ఆలోచిస్తాడు… ప్రత్యేకంగానే చేస్తాడు.. రీసెంట్గా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ గా మారిపోయింది. ఎన్టీఆర్ త్వరలోనే ఓ ఓటీటీ షో కోసం హోస్టుగా మారబోతున్నాడట ఆల్రెడీ.. ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు . బిగ్ బాస్ షోలను హోస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది . అయితే ఇదంతా ఆయనకు పాన్ ఇండియా స్టేటస్ రాకముందు చేసింది.

పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక ఏ హీరో కూడా ఇలా హోస్ట్ చేయడానికి ఇష్టపడరు . కానీ ఎన్టీఆర్ తనకున్న ఇష్టం కారణంగా ఈ షోని హోస్ట్ చేయడానికి ఓకే చేశారట . త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వార్ 2 ను సెట్స్ పై కి తీసుకురాబోతున్నాడు . ఆ తర్వాత దేవర 2 ని కంప్లీట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయి ఉన్నాడు..!!