స్టార్ హీరోలు సంచలన నిర్ణయం..అదే జరిగితే రాజమౌళి తట్టుకోగలడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ.. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న డైరెక్టర్లకే ..అవకాశాలు ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు. అయితే చాలామంది డైరెక్టర్ లు సినిమాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెరకెక్కించి రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే సినిమా కోసం ఏళ్లు తరబడి గ్యాప్ ఇస్తూ వస్తున్నారు.

రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . స్టార్ హీరోస్ అందరూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాకి సంవత్సరం లేదా రెండేళ్ల లోపు ఒక సినిమా షూట్ కంప్లీట్ చేయాలి అని .. లేని పక్షంలో అటువంటి సినిమాలు ఓకే చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . చాలామంది పాన్ ఇండియా హీరోస్ ఇదే విషయంపై చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది.

ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం రాజమౌళి పని గోవిందా అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే రాజమౌళి ఒక సినిమాని మూడేళ్లు నాలుగేళ్లు తీస్తాడు . మరి అలాంటి డైరెక్టర్కు ఏ స్టార్ హీరో కాంప్రమైజ్ అయి డేట్స్ ఇస్తారు ..? అంటూ ప్రశ్నిస్తున్నారు . ఇండస్ట్రీలో అందరూ హీరోలు ఒక నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ఉండాలి అని .. అప్పుడు రాజమౌళినే తన ఆలోచనలను మార్చుకొని సినిమాల ద్వారా తెరకెక్కించాలి అని సజెస్ట్ చేస్తున్నారు . ఏమో రాజమౌళి ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూద్దాం…???