భారీ బడ్జెట్ మూవీలో కీర్తి సురేష్.. కలలో కూడా ఊహించని హీరోతో మూవీకి గ్రీన్ సిగ్నల్..?!

టాలీవుడ్ లో ఒకప్పుడు వరస సినిమా ఆఫర్లను అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన కీర్తి సురేష్.. త‌న న‌ట‌న‌తో నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మహానటి సావిత్రి బయోపిక్ లో అచ్చు సావిత్రి మళ్ళీ వచ్చిందా అన్న విధంగా నటించి ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో చివరిగా దసరా సినిమాలో నటించిన కీర్తి.. తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. ఎవరు కలలో కూడా ఊహించని హీరోతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరో.. ఆ సినిమా ఏంటో.. తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Suhas becomes a proud father - Telugu News - IndiaGlitz.com

ఇటీవల కాలంలో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ యంగ్ హీరో.. ముందు షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి.. కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డును దక్కించుకున్నాడు. ఇకపోతే సుహాస్ గ‌తేడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రసన్న వదనం, గొర్రెపురాణం, శ్రీరంగనీతులు, ఆనందరావు అడ్వెంచర్స్ ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. ఇలా బిజీ స్కెడ్యూల్ తో కాళీ లేకుండా గడుపుతున్న సుహాస్, కీర్తి సురేష్ జోడి కట్టబోతున్నార‌ట‌.

Keerthy Suresh Reaction On Wedding Rumours says Will Reveal Mystery Man  Whenever I have to

నిన్న‌మొన్నటిదాకా టాలీవుడ్ అగ్ర హీరోలు నాని, మహేష్ లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడిన కీర్తి.. ఒక్కసారిగా సుహాస్ లాంటి చిన్న హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే పర్ఫామెన్స్ స్కోప్‌ ఉన్న పాత్ర వస్తే కచ్చితంగా సినిమా ఎలాంటిదైనా కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉప్పు కప్పురంబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది థియేటర్స్ మూవీ కాదు.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందించబడుతుంది. అనిల్ ఐవి శశి డైరెక్షన్‌లో రాధిక లావు ప్రొడ్యూసర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక కీర్తి సురేష్, సుహాస్ కలిసి జంటగా ఈ సినిమాలో నటించనున్నారని ఇటీవల జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో అఫీషియల్ గా ప్రకటించారు సుహాస్‌. ఇక కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్ తో సుహాస్ సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమాకు మరింత హైపర్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.