“ప్లీజ్ నాతో ఆపని చేయవా..?”.. స్టేజీ పైనే స్టార్ హీరోని ఇబ్బంది పెట్టిన మోహన్ బాబు..!

మోహన్ బాబు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్న హీరో . ఒకప్పుడు మోహన్ బాబు అంటే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయి అరుపులు అరిచే వాళ్ళు .. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్ లో వింటూ ఉంటే ఎలా గూస్బంస్ వచ్చేటివో మనకు తెలిసిందే. ప్రజెంట్ మోహన్ బాబు కి ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆయనను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా మోహన్ బాబు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ 32వ అన్యువల్ డే ను చాలా ఘనంగా నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ముఖ్యఅతిథిగా వచ్చారు . ఈ క్రమంలోనే మోహన్ లాల్ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మోహన్ బాబు పలు సంచలన కామెంట్స్ చేశారు . విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ .. “నేను హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన మంచి పేరు తెచ్చుకున్నాను అని.. నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి ప్లాప్ అయ్యాను అని ..అలాంటి సమయంలో మోహన్ లాల్ తీసిన చిత్రం నాకు బాగా నచ్చింది అని ..నేను “అల్లుడుగారు” అని తెలుగులో రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టగలిగాను అని చెప్పుకొచ్చాడు”.

” అంతేకాదు మోహన్ లాల్.. నా బిడ్డ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు అని.. దానికి ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని .. ఒకవేళ అడిగిన కూడా ప్రెసెంట్ నేను ఇచ్చే పొజిషన్లో లేను అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఇక చివరిగా మాట్లాడుతూ మోహన్ లాల్ తో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అని.. కన్నప్పలో ఇద్దరం కలిసి నటిస్తున్నాం కాబట్టి ఆ కోరిక తీరుతుందని.. కానీ మా కాంబోలో ఏ సీన్స్ లేవు అని.. దయచేసి నీతో నటించడానికి నీ సినిమాలలో నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించు.. ప్లీజ్ అది విలన్ రోల్ అయినా పర్లేదు అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు”. ఇదే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!