అలా చేస్తే నీ అనుకున్న వాడు కూడా నీ మొఖం చూడరు.. అలీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు.. కారణం ఇదే..?!

తెలుగు స్టార్‌ కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాధించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984లో సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ.. ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పటి స్టార్ హీరోస్ నుంచి ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సినిమాలోని ఆయ‌న‌ నటించి మెప్పించాడు. వారితో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. అలాంటి అలీని శోభన్ బాబు ఓ విషయంలో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారట.

TC.com Exclusive: Sobhan Babu's last Interview | Telugu Cinema

ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు.. లేదంటే నీ కులపోడు కూడా నీ దగ్గరకురాడు అంటూ ఫైర్ అయ్యారని.. చెప్పుకొచ్చాడు. ఇంతకీ శోభన్ బాబు అలా వార్నింగ్ ఇవ్వ‌డానికి కారణం ఏంటో.. తెలుసుకుందాం. అలీ.. శోభన్ బాబు కలిసి ఓ సినిమాలో నటిస్తున్న టైం లో.. అలీ డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టేస్తాడేమో అన్న ఉద్దేశంతో.. శోభన్ బాబు ఆయనకు వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అలీ ఇటీవల జరిగిన ఆలీతో సరదాగా షో లో గెస్ట్ గా వచ్చిన శివాజీకి వివరించాడు. శోభన్ బాబు.. ఆలీతో మాట్లాడుతూ ఆర్టిస్ట్ అనేవాడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఒకవేళ నువ్వు డబ్బు లేకుండా అలమటిస్తే నీ కులపోడు కూడా నీ వైపు రాడు.

Comedian Ali Birthday Today - businessoftollywood

నిన్ను ఎవరు చూడరు. నీకు అన్నం కూడా పెట్టారు. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు నిన్ను పట్టించుకోరు. నువ్వు బాగుంటేనే అందరూ నీ దగ్గరికి వస్తారని చెప్పుకొచ్చాడట. నీ దగ్గర డబ్బు లేకుంటే అప్పు అడిగే ఉద్దేశం నీకు లేకున్నా.. ఎవరు నీ వైపు చూడర‌ని. ఇది గుర్తుపెట్టుకుని మసులుకో.. కాస్ట్లీ కార్ల‌ లాంటివి కొనకు.. నల్ల బంగారాన్ని నమ్ముకో అని వివరించారట. అప్పుడు విషయం అర్థం కాక అలీ నల్ల బంగారం అంటే ఏంటండి.. అని ప్రశ్నించగా అదేరా భూమి అని శోభన్ బాబు వివరించారట. ఇదే విషయాన్ని నేను నీకు చెప్పాను అంటూ శివాజీకి వివరిస్తూ.. శోభ‌న్ బాబును గుర్తు చేసుకున్నాడు అలీ.