ఒకే ఏడాదిలో ఏకంగా పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంత ఏడాదికి ఒక సినిమాని రిలీజ్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నారు. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమా అంటే రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా రావడం కూడా గ్రేట్ అని చెప్పవచ్చు. కానీ అప్పట్లో హీరోలు మాత్రం ఏడాదికి పది, పదిహేను సినిమాలకు పైగా ఒకే ఏడాదిలో రిలీజ్ చేసి రికార్డులు సృష్టించారు. అలా ఏడాదికి పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన మన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ 1970 లో ఒకేసారి 16 సినిమాల్లో నటించగా.. తర్వాతే ఏడాది వాటిలో 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే 1972లో కృష్ణ నటించిన 19 సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజై రికార్డ్ సృష్టించాయి. ఇప్పటివరకు ఈ రికార్డ్ మరే స్టార్ హీరో బ్రేక్ చేయలేకపోయారు. అలాగే నందమూరి నటసార్వభౌమ తారక రామారావు హీరోగా నటించిన 17 సినిమాలు 1964 ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. పన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే.

అలా కృష్ణంరాజు 1974లో ఏకంగా 17 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దాదాపు ఆ సినిమాలన్నీ హిట్ టాక్ సొంతం చేసుకున్నాను.
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కాస్త నెమ్మదించిన సంగతి తెలిసిందే. అయితే కెరీర్ మొదటి నుంచి ఎంతో కష్టపడి మెగా హీరో పేరును సంపాదించుకున్న చిరంజీవి.. 1980లో ఏకంగా 14 సినిమాలను రిలీజ్ చేశారు. అలాగే టాలీవుడ్ హీరో జగపతిబాబు ఒక ఏడాదిలో ఆరు సినిమాలు రిలీజ్ చేశాడు. బాలకృష్ణ ఒక 1987లోనే ఏకంగా ఏడు సినిమాలను రిలీజ్ చేసి తమ సత్తా చాటుకున్నాడు.