మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిప్తి దిమ్రీ.. అదృష్టమంతా ఈమె చుట్టూనే ఉందిగా..!

లక్ ఉంటే ఒక్క సినిమా చాలు పది సినిమాలు అవసరం లేదు అనే డైలాగ్ ని తూచా తప్పకుండా పాటించింది త్రిప్తి దిమ్రీ. అనిమల్ మూవీ ద్వారా మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది.

సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా ఈ ముద్దుగుమ్మ కి మంచి పాపులారిటీ దక్కింది. ఇక భూల్ భూలయ్యా 3 లో కీలకమైన పాత్రలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ని మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ మూడవ విడతలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తుండగా విద్యాబాలన్ మళ్లీ మంజూలికగా కనిపించనుంది. మాధురి దీక్షిత్ కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది.

అదేవిధంగా త్రిప్తి దిమ్రీ నీ చేర్చుకోవడం గురించి ఈ తాజా ప్రకటనతో అందరి దృష్టి ఈ హారర్ కామెడీ చిత్రంపై ఉంది. ఇక ఈ సినిమా పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్తను విన్న ప్రేక్షకులు.. అదృష్టమంతా నీ చుట్టూనే ఉన్నట్లుంది గా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.