పుష్పతో తలపడనున్న కల్కి మూవీ.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

ఇద్దరు పాన్ ఇండియా హీరోలు సినిమాలతో కొట్టుకుంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇదే జరుగుతుంది.. ఒకపక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిన ప్రభాస్ మరో పక్క పుష్ప సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ. ఇద్దరూ తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

అదేవిధంగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే హీరోయిన్గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలలో నటిస్తున్న మూవీ కల్కి. ఈ రెండు మూవీస్ కూడా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానున్నాయి.

ఇక ఈ మూవీని మే తొమ్మిది గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. పుష్ప 2 మూవీ కొన్ని కారణాల వలన విడుదల వాయిదా పడనుంది అంటూ అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఒకసారి కమిట్ అయితే తగ్గేదేలే అంటున్నారు. తాము ప్రకటించిన డేట్ కి కచ్చితంగా రిలీజ్ చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా కల్కి మూవీ కూడా చెప్పిన గడువునే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా ప్రభాస్ మరియు బన్నీ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.ఇక వీరిద్దరి ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ లో ఉన్నారు.