వెనకడుగు వేసేదేలే అంటున్న కల్కి మేకర్స్.. విజయం ఎవరిది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు కల్కి. మరి ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి.

ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మన టాలీవుడ్ అనేక సినిమాలు అనుకున్న డేట్స్ కి ఈ ఏడాది ముందుకు రాలేదు. అనుకోని కారణాల చేత వాయిదా పడ్డాయి. అదేవిధంగా కల్కి సినిమా కూడా ముందు జనవరిలో రిలీజ్ కావాల్సింది మే నెలలోకి వాయిదా పడింది.

 

అయితే ఇప్పుడు మళ్లీ ఈ డేట్ నుంచి కూడా వాయిదా పడవచ్చు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం అందుకు ఛాన్స్ లేదనే అంటున్నారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 9 రిలీజ్ కి రాబోతున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఇక కల్కి మూవీ మే 9న కన్ఫామ్ గా రేస్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది.