“వాడు ఓ యూస్ లెస్ ఫెలో”.. పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ ఇచ్చిన పూనమ్.. ఇంత పచ్చిగా తిట్టేసింది ఏంటి..?

కొద్ది నెలలే .. కేవలం కొద్ది నెలలు అంటే కొద్ది నెలలే .. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . పొలిటికల్ వార్ లో సినీ వాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. పలు రకాల పోస్టులతో పరోక్షకంగా ఏపీ పాలిటిక్స్ పై స్పందిస్తున్నారు . రీసెంట్గా అలాంటి పని చేసింది ఒకప్పటి హీరోయిన్ పూనం కౌర్. చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కాంట్రవర్షియల్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మధ్య ఎప్పుడు ట్రయాంగిల్ వార్ జరుగుతూనే ఉంటుంది .

ఇది చాలామందికి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ కి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . దానిపై ఇప్పటికీ అఫీషియల్ ప్రకటన అయితే లేదు . రీసెంట్ గా పూనం పరోక్షకంగా పవన్ కళ్యాణ్ మాటలను టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును స్ట్రైట్ ఫార్వార్డ్ గా తిట్టేసింది . భీమవరంలో జనసేన నేతలతో మాట్లాడుతూ ..”జగన్ సిద్ధమంటున్నాడు మేము యుద్ధం అంటాము ..సినిమాలో కూడా నేను పంచ్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడను..”..

” అత్తారింటికి దారేది మూవీలో సింహం గడ్డం గీసుకోదు ,,నేను గీసుకుంటాను అనే డైలాగ్ చెప్పడానికి నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ త్రివిక్రమ్ నా దగ్గర అది ఎలాగోలా చెప్పించేశాడు కామెడీ చేపించాడు అని చెప్తాడు”. ఓ మీడియా సంస్ధ దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది . దాని కింద కామెంట్ గా “యూస్ లెస్ ఫెలో” అంటూ త్రివిక్రమ్ ని ట్యాగ్ చేస్తూ మరి పూనం కవర్ కౌంటర్ వేసింది . ఇప్పుడు పూనం కౌర్ వేసిన కౌంటర్ ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది..!