కొత్త ట్రెండ్స్ స్టార్ట్ చేసిన ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ టీం.. స్మశాన వాటికలో టీజర్ లాంచ్.. వామ్మో.. ఇదెక్కడి చోద్యం..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా మూవీ ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘. 2014లో కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా.. ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ సినిమా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకు సీక్వెల్ ను ఎంవీవీ సినిమా, కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమా యూనిట్ మరొక గూస్ బంప్స్‌ అప్డేట్‌ను ఇచ్చారు. గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్ ఫిబ్రవరి 24న నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా.. టాలీవుడ్ లోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. బేగంపేట శ్మ‌శానవాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు ఈవెంట్ జరగబోతున్నట్లు యూనిట్ వీడియో ద్వారా రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో తెగ‌ వైరల్ అవుతుంది. శ్మ‌శాన వాటికలో టీజర్ లంచ్ ఏంట్రా.. ఇదెక్కడి చోద్యం రా స్వామి.. అంటూ నిటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ లతో పాటు.. సత్యా, సునీల్, రవిశంకర్, అలీ, శ్రీకాంత్ అయ్యంగర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో కమెడియన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ రేంజ్ లో కామెడీ హర్రర్ ఉంటుందో.. అని ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.