యాక్షన్ విజువల్స్, ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వెంకీ మామ.. సైంధవ్‌ ట్రైలర్ (వీడియో)..

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ సైంధ‌వ్‌. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా వెంకీ మామ ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ కొడతాడు అనే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

SAINDHAV Movie Theatrical Trailer | Venkatesh Daggubati | Sailesh Kolanu |  Santhosh Narayanan | - YouTube

దర్శకుడు శైలేష్ సినిమాలైన్‌ మొత్తం ట్రైలర్ లోనే కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. సైంధవ్‌ పాత్ర పై ఉన్న ఎమోషన్స్, యాక్షన్స్ తాలూకా వెయిట్ ని వెంకటేష్ క్యారీ చేసే విధానాన్ని ఈ ట్రైలర్ లో చూపించాడు. శైలేష్ ఈ ట్రైలర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెయిన్ గా విజువల్స్ అన్ని చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. యాక్షన్ బ్లాగ్‌లో అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక వెంకటేష్ నుంచి బీస్ట్ మోడ్ లోనే నెవ‌ర్ బిఫోర్ గా సైంధవ్‌ సినిమా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి మిస్ అవుతున్న అగ్రిసివ్ వెంకటేష్ ను ఈ సినిమాతో చూడబోతున్నామని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

Saindhav' Trailer: Psycho Makes A Comeback For Her Daughter! | Venkatesh Saindhav  Trailer

ఇక వెంకటేష్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, అండ్రియాలు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటుగా బాలీవుడ్ వైవిధ్య‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ నటనతో పాత్రకు న్యాచురల్టి తీసుకువచ్చారని తెలుస్తుంది. ట్రైలర్ తో సంతోష్ నారాయణ మ్యూజిక్ మరింత హైలెట్గా కనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే కచ్చితంగా వెంకీ మామ బ్లాక్ బ‌స్టర్ కొడతాడు అనే ఫీల్ కలుగుతుంది. ఇక ఈ నెల 13న సంక్రాంతి కానుకగా సైంధవ్‌ ప్రేక్షకులు ముందుకు రానుంది. వెంకీ మామ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.