మహేష్ ” గుంటూరు కారం ” మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ…!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది కీలక పాత్రలలో పోషిస్తున్నారు. అలాగే ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి (ఈనెల) 12న ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ వ‌ర‌స‌ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక తాజాగా ట్విట్టర్ ద్వారా నాగ వంశీ ముచ్చటించాడు. నాగ వంశీ మాట్లాడుతూ..” అవసరం ఉన్న మేరకు ఈ గుంటూరు కారం మూవీకి థియేటర్స్ కేటాయించేలా చేస్తాం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ బీజీఎం రికార్డింగ్ ని థమన్ పూర్తి చేశారు. ఎంతో సూపర్ గా వచ్చింది.

ఇక ఈ మూవీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ ని కూడా మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక లాస్ట్ 45 నిమిషాల పాటు సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఓవరాల్ గా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ ని అందిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ వంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.