” బాలయ్య 109వ ” మూవీపై అదిరిపోయే అప్డేట్..!

నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలయ్య హీరోగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ బాలయ్య వరుస హ్యాట్రిక్ హిట్లను కొట్టిన అనంతరం తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ మూవీ షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మేకర్స్ రీసెంట్ గానే రంపచోడవరం అలాగే మారేడుమిల్లి ప్రాంతాలలో షూటింగ్ని స్టార్ట్ చేసినట్లు సమాచారం.

అలాగే మెయిన్ లీడ్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ రూపొందిస్తున్నారట. ఇక ఈ షెడ్యూల్ వారం పాటుగా కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే ఈ ఊరు నలుమూలల ఉన్న నందమూరి అభిమానులు బాలయ్యని చూసేందుకు ఉర్రూతలూగుతున్నారు.