రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా బ‌డ్జెట్ తెలిస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే…!

దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తెరకెక్కించిన అప్పటి బాహుబలి నుంచి నేటీ ఆర్ఆర్ఆర్ వరకు ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి తన తదుపరి సినిమాని టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ పై మహేష్ మరియు రాజమౌళి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీపై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ మూవీ బడ్జెట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకి కూడా ఇంత బడ్జెట్ పెట్టలేదు. అయితే జక్కన్న మాత్రం ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా తీసుకునే అవకాశం ఉందట. వరల్డ్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తాడట జక్కన్న. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.