గుంటూరు కారం 60…. ఆ నాలుగు సినిమాలు 40… ఇదెక్క‌డి దారుణం రా సామీ…!

మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 12న సంక్రాంతి పండగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. అసలు ఇంత పంతం, ఇంత తెగింపు ఏమిటి? ఎవరికి న్యాయం జరుగుతుంది.

ఈ సంక్రాంతి బరిలో ఎవరు లాభాల్లోకి వెళతారు ఇంకెవరు నష్టాల్లోకి వెళతారో అని ఆత్రుత అందరిలోనూ ఉంది. ఇక ఇంతటి తెగింపు ఎవ్వరికి మంచిది కాదు అంటూ కొందరు కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక గుంటూరు కారం సినిమాకు 12న సుమారుగా 90 శాతం థియేటర్లు దొరికాయట. ఇక 13న కనీసం 30% థియేటర్లు ఖాళీ చేయాల్సి ఉన్నట్లుగా సమాచారం. ఎందుకంటే ఈగిల్, సైంధవ్ సినిమాలు వాటి థియేటర్లను ఇవి బుక్ చేసుకున్నాయి. ఇక ఆ మరునాడు వచ్చే నా సామి రంగ వాటి నుంచి కనీసం ఓ పది శాతం థియేటర్లు తీసుకుంటుంది.

ఇక హనుమాన్, సైంధవ్, ఈగిల్, నా సామి రంగ సినిమాలు తలో 10 శాతం థియేటర్లు తీసుకున్నాయి. ఇక ఈ సినిమాలన్నీ తొలి వారం అంతా థియేటర్లను అంటీ పెట్టుకునే ఉంటాయి హిట్ అయినా కాకున్న. మరి డిజాస్టర్ అయితే తప్ప థియేటర్ లోంచి ఆ సినిమా తప్పుకోదు. అంటే గుంటూరు కారం 60 శాతం థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి ఉంది. ఇక మహేష్ గుంటూరు కారం సినిమా కనుక సూపర్ హిట్ అయితే మరిన్ని థియేటర్లు దక్కే అవకాశం ఉంది. మరి మహేష్ గుంటూరు కారం మిగతా ఐదు సినిమాలను తొక్కేస్తుందో లేదా మిగతా ఐదు సినిమాలు కలిసి మహేష్ సినిమాని తొక్కేస్తారో చూడాలి మరి.