నాగ్ ‘ నా సామి రంగా ‘ బిజినెస్‌… ముస‌లోడు కుమ్మి ప‌డేశాడే…!

నాన్ థియేటరికల్ అమ్మకాలు కష్టంగా ఉన్న రోజుల్లో నాగార్జున ” నా సామి రంగ ” మూవీని గట్టెక్కిసింది. మొత్తం నాన్ థియేటర్ హక్కుల రూపంలో 32 కోట్ల వరకు సాధించినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను మా టీవీ, హాట్ స్టార్, హిందీ డబ్బింగ్ హక్కులను థర్డ్ స్టోరీకి అమ్మినట్లు తెలుస్తుంది. ఇక మొత్తం నాన్ దియేటర్ హక్కులు అన్నీ కలిపి 32 కోట్ల వరకు రికవరీ అయినట్లు సమాచారం.

చిట్లూరి శ్రీను నిర్మించిన ఈ సినిమాకి కాస్త గట్టి రేంజ్ లోనే ఖర్చు పెట్టారు. 45 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఇందులో నాగార్జున రెమ్యూనరేషన్నే 12 కోట్ల వరకు పుచ్చుకున్నాడట. ఇక మొత్తం మీద మూడు వంతులు రికవరీ వచ్చింది. ఇక ఈ సినిమాను నాగార్జున తన అన్నపూర్ణ సమస్త ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఇక ఒకటి రెండు చోట్ల నాన్ థియేటర్ అడ్వాన్స్ ల మీద ఇస్తున్నారు. ఎక్కువ చోట్ల గీత, అన్నపూర్ణ, దిల్ రాజు ఇలా రకరకాలుగా పంపిణీ చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో నాగార్జున సినిమాకు మంచి బజ్ వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇక ఈ వార్త విన్న ప్రేక్షకులు..” ముసలోడు కుమ్మి పడేసాడుగా… రానున్న కాలంలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.