టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోతే ఇలా బ‌లైపోవాల్సిందేనా…!

సాధారణంగా సినిమా ఎవ్వరైనా తీస్తారు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే మార్కెట్ ఒక ఎత్తు.. ఇక థియేటర్లలో విడుదల చేయడం అంతకన్నా పెద్ద విషయమే. టాలీవుడ్ లో ప్రస్తుతం థియేటర్లను సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇక సంక్రాంతికి బరిలో ఉన్న కొన్ని సినిమాలకి థియేటర్లు కోరువు అవుతాయి. అందులో హనుమాన్ మూవీ ఒకటి.

ఈ సినిమా పబ్లిక్ విషయంలో చురుగ్గా ఉన్నప్పటికీ థియేటర్ల విషయంలో మాత్రం ఏ మాత్రం చురుకుదనం కనిపించడం లేదు. సంక్రాంతి 12వ తేదీకి సంబంధించి 90% థియేటర్లను గుంటూరు కారం పట్టుకుపోవడంతో..అర, కొర థియేటర్లు హనుమాన్కు తొలి రోజు ఇచ్చిన.. మరునాడు వాటిని సైంధవ్ ఎగరేసుకుపోయింది.

ఇక అడుగు బొడుగు ఏమన్నా మిగిలితే ఈగిల్ తన ఖాతాలో వేసుకుంటుంది. దీని బట్టి అర్థం చేసుకునేది ఏమిటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలంటే ఓ సూపర్ హీరో అయి ఉండాలనే చెప్పాలి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలతో తలపడాలంటే మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం హనుమాన్ మూవీతో తేజ అదే చేస్తున్నాడు. మరి ఇది తేజకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి మరి.