ఎన్టీఆర్ “దేవర”లో విజయ్ దేవరకొండ .. పాత్ర ఏంటో తెలిస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మరి ఏ హీరో కూడా సాటి రారు అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. రెండవ హీరోయిన్గా రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ కి బ్రదర్ పాత్రలో ఓ హీరో నటించబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్గా ఆ హీరో పేరు బయటకు వచ్చేసింది . ఈ సినిమాలో దేవర బ్రదర్ గా సూరిగాడు అనే పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట . ఈ సినిమాలో ఆయనది గెస్ట్ అపీరియన్స్ అంటూ తెలుస్తుంది .

అంతేకాదు పార్ట్ 2 లో కూడా ఈయన కొన్ని కీలకమైన సీన్స్ లో కనిపించబోతున్నాడట . గెస్ట్అపీరియన్స్ అంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం కాకుండా సినిమా కథలో కూడా భాగం కాబోతున్నాడట విజయ్ దేవరకొండ. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఏప్రిల్ 8 న రిలీజ్ కాబోతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దేవర న్యూ పోస్టర్ హీట్ పెంచేస్తుంది..!!