మహేష్ బాబు తర్వాత.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో జాక్పాట్ కొట్టేసిన ఆ లక్కీ హీరో ఎవరంటే..?

పాన్‌ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాకముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు.

SS Rajamouli Confirms Next Venture With Mahesh Babu After Roudram Ranam  Rudhiram - Filmibeat

ముఖ్యంగా స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న సినిమా అంటే ఏదో కంటెంట్ కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. రాజమౌళి కూడా వారి ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగానే సినిమాలు తీస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటికే రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు అందాయి. నిజానికి టాలీవుడ్‌కు బాహుబలి సినిమాతో భారీ పాన్‌ ఇండియా సక్సెస్‌ను చూపించాడు రాజమౌళి. ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ తో సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమా తర్వాత మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

Suriya rejects Rajamouli

ఇప్పటికే సూర్యతో చేయాల్సిన సినిమా డిలే అవుతూ వస్తోంది. మగధీర తర్వాత రాజమౌళి సూర్యతో మూవీ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇక మహేష్ బాబు సినిమా తర్వాత సూర్యతో.. రాజమౌళి సినిమా ప‌ట్టలెక్కుతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సూర్య ఎప్పటి నుంచో రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. సూర్య, రాజమౌళి కాంబోలో సినిమా వస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.