సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతున్నారో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 13న గ్రాండ్గా థియేటర్స్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు . ఈ సినిమా అతడు సినిమాకి మించి పోయే రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ప్రకటించడం గమనార్హం.

అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాట రిలీజ్ అయిన ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది . అయితే ఈసారి రిలీజ్ అయ్యే అప్డేట్స్ ఏది కూడా అలా ట్రోలింగ్ ఎదుర్కోకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ . కాగా జనవరి 6వ తేదీ గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తుంది . నిజానికి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ గుంటూరు కు మధ్యలో పెట్టుకోవాలనుకున్నారట.

గుంటూరు కారం సినిమాకు ఆప్ట్ గా సెట్ అవుతుంది అంటూ భావించారట . కానీ సెక్యూరిటీ పర్పస్ కారణంగా హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నారట . కానీ ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చేయని విధంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీ మెంట్ సినిమాస్లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానుందట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మహేష్ బాబు ట్రెండ్ సెట్ చేస్తాడు అని ట్రెండ్ ఫాలో అవ్వడు అని అంటున్నారు అభిమానులు..!