సలార్ లో ప్రభాస్ గొడ్డుకారంతో అన్నం తినడానికి కారణం ఇదే.. ప్రశాంత్ సీక్రెట్ ని కనిపెట్టేసిన ఫ్యాన్స్ .!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “సలార్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. దాదాపు 700 కోట్ల కలెక్ట్ చేసేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది .

ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్ మైల్ స్టోన్ క్రియేట్ చేసిన మూవీ గా నిలుస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కేవలం గొడ్డుకారం మాత్రమే తింటాడు . ఎక్కడా కూడా రాజ భోగాలు అనుభవించడు. దానికి కారణం ఏంటా..?? అంటూ అభిమానులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు . కాగా బొమ్మ కత్తి పట్టుకుంటేనే ప్రభాస్ వాళ్ళ అమ్మగారు గజగజ వణికి పోయారు . ఇంట్లో కూర వండాలంటే కాయకూరలు కట్ చేయాలి..

కట్ చేయాలి అంటే కత్తి , కత్తిపీటలు ఉండాలి . అది చూస్తే మళ్ళీ ప్రభాస్ ఎక్కడ క్రూరంగా మారిపోతాడో అన్న భయంతోనే ఆమె అసలు ఇంట్లో కూరనే వండడం మానేసిందట . అంతేకాదు శౌర్యంగా పర్వం సినిమాలో దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాడట ప్రశాంత్ నీల్ ఇదే విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంటున్నాడు..!!