కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఓ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ మూవీ ఏంటంటే..?

కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్ప‌టినుంచి వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా పాపుల‌ర్ అవుతున్నారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియక‌పోయిన‌.. ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ల గురించి వారి జాతకాల గురించి చుప్తూ సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయిపోతున్నారు.

Astrologer Venu Swamy : ఫలించిన వేణు స్వామి పూజలు.. బంఫర్ ఆఫర్!

అయితే గతంలో వేణు స్వామి తాను ఎన్నో సినిమాలకు వ‌ర్క్‌ చేశానని, ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టడం దగ్గర నుంచి కొన్ని సినిమాలకు ప్రొడక్షన్‌లో కూడా పని చేశానని చెబుతూ ఉంటాడు. అయితే ఆయ‌న‌ నిజంగా పనిచేశాడో లేదో చాలా మందికి తెలియ‌దు. కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయన‌ విషయం మాత్రం ఆయన సోషల్ మీడియా అకౌంట్ ఫాలో అయితే అర్థమవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభాస్ కెరీర్ అయిపోయిందంటూ కామెంట్స్ చేసిన వేణు స్వామి.. సలార్ హిట్ అయిన నేపథ్యంలో ఎన్ఓ ట్రోల్స్‌కు గురౌతూ వార్తల్లో వైర‌ల్ అయ్యాడు.

వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా? | Astrologer Venu Swamy Acted Telugu Movie Jagapathi - Sakshi

ఆ సంగతి అలా ఉంచితే.. తాజాగా ఆయన ఓ సినిమాలో నటించాడంటూ ఆ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వేణు స్వామి జగపతిబాబు హీరోగా నటించిన జగపతి అనే సినిమాలో పూజారి పాత్రలో నటించాడు. అందులో హీరోయిన్ రక్షిత న‌టించింది. ఈ సినిమాలో వేణు స్వామి కనిపించాడు. ఆయనకి రెండు డైలాగులు కూడా ఇచ్చారు. అంతే కాదు త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడులో కూడా వేణు స్వామి ఉన్నాడ‌ట. ఒక సాంగ్ లో ఆయన క‌నిపించార‌ని తెలుస్తోంది.