” గుంటూరు కారం “తో కృష్ణ ని గుర్తు చేసేలా అలాంటి ప్లాన్.. గురూజీ మాస్టర్ స్కెచ్..

ఏడాది సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవెయిట్డ్‌గా చూస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జ‌న‌వరి 12న గ్రాండ్ లెవెల్లో ప్రేక్ష‌కుల ముందుకి రానుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతుంది.. అనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.

Guntur Kaaram (2024) - IMDb

ఈ సినిమాల్లో సంక్రాంతి వైబ్స్‌ స్పష్టంగా కనిపిస్తోంది. మహేష్ బాబు ఇదివరకు ఎప్పుడూ కనిపించని మాస్ అవతారంలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. దానికి తోడు మాస్‌తో పాటు మహేష్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా మరిన్ని ఐటమ్స్ కూడా ఈ సినిమాలో ప్లాన్ చేశాడట గురూజీ. ఇక ఇటీవల తాజాగా రిలీజ్ అయిన కుర్చి మడత పెట్టి సాంగ్ విమర్శలకు లోనైనప్పటికీ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పండుగ రోజు మాస్ థియేటర్లో ఈ పాటను చూస్తే పూనకాలు గ్యారెంటీ అనే విధంగా ఈ సాంగ్ ఉంది. దీనికి తోడు ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్సులు కూడా ఉన్నాయని సమాచారం.

Guntur Kaaram: Telugu States Business Set to Secure Strong Deal

2022 నవంబర్లో కృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ మ‌ర‌ణం తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఈ సినిమాతో కృష్ణ ని కూడా గుర్తు చేసుకునే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. ఓ ఫైట్ సీన్లో కృష్ణ డైలాగ్ తో పాటు ఓ సాంగ్ లో బిజిఎం ని కూడా కాపీ చేశారని తెలుస్తుంది. మరి ఈ డైలాగు, పాట ఏవో తెలియాలంటే వేచి చూడాలి. ఈనెల 6న గుంటూరు కారం ట్రైలర్ రానుంది. ఈ ట్రైలర్లో దీనికి సంబంధించిన క్లూ ఏదైనా గురూజీ ఇచ్చాడేమో చూడాలి.