డయాబెటిస్ మందులు వాడడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్సా .. తెలిస్తే షాక్ అవుతారు..!!

దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినా వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాకా తీసుకెళ్తాయి.

యూఎస్ లోని ఓ మహిళకి అలాంటి దారుణమైన అనుభవమే ఎదుర్కొంది. డయాబెటిస్ కోసం వాడే మందులు ఇంతటి చెడు ప్రభావాన్ని తెచ్చి పెట్టాయి. వివరాల్లోకి వెళితే… టెక్సాస్ కు చెందిన అమెరికన్ ప్రొఫెసర్ టొప్ 2 డయాబెటిస్ కి డ్రగ్ ఓజెంపీక్ మందులను వాడుతుంది. దీనివల్ల ఆమె విపరీతమైన దుష్పరనామాలను ఎదుర్కొంది. ఒక్కసారిగా ఆకలిని తగ్గించేసింది. దీంతో బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె బాడీలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయాయి.

జీర్ణక్రియను నెమ్మదించడంతో ఇతరత్ర దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదికాస్త డిప్రెషన్ యాంగ్జయిటీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె టాయిలెట్ కి వెళ్లినప్పుడల్లా ఆమె చర్మం పోలుసులుగా ఊడిపోవడం ప్రారంభమైంది. మూత్రం విజర్జనకు వెళ్లిన ప్రతిసారి విపరీతమైన నొప్పి బాధ తట్టుకోలేకపోయింది. ఇంతలా ఈ మందు నా శరీరంపై ప్రభావం చూపిస్తుందని అనుకోలేదని బోరున ఏడ్చేసింది. దీంతో ఆమె వైద్యుడు ఆ మందులను సిఫార్సు చేయడం ఆపేశాడు.

ఆ మందుని వాడటం ఆపేసినా ఇంకా ఆ డ్రగ్ తాలుక దురద, మూత్ర విసర్జన నొప్పి ఇంకా పోలేదని చెప్పుకొచ్చింది. జంతువులలో ఈ డ్రగ్‌ని ప్రయోగిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికలను ఇచ్చింది. అయితే ఆ ఔషధం మనుషుల్లో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అరుదైన జన్యు పరిస్థితి ఉన్నవారు, లేదా కుటుంబ సభ్యులకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు ఈ మందుని సిఫార్సు చేయకూడదని పేర్కొంది.