టీనేజ్ గ‌ర్ల్స్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారా… మీరు డేంజర్‌లో ఉన్న‌ట్టే..!

ఈరోజుల్లో సోషల్ మీడియా ఎకౌంట్ లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా యూత్ అయితే కచ్చితంగా ఏదో ఒక సోషల్ మీడియా వేదికను ఫాలో అవుతూ ఉంటారు. సోషల్ మీడియా టీనేజ్ యువతను బాగా ప్రభావితం చేస్తుంది. తరచుగా ఇన్‌స్టాగ్రామ్ యూజ్‌ చేసే టీనేజ్ గర్ల్స్ అందులో స్లిమ్ గా, ఫీట్ గా ఉండే మోడల్స్ కలిగి ఉన్న యాడ్స్ వల్ల ఫిజికల్ ఇంపీరియారిటీకి గురయ్యే ప్రమాదం ఉందట. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఇది వెళ్లడైంది.

ఆస్ట్రేలియాలోని గిఫిట్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అప్లై సైకాలజీ విభాగానికి చెందిన సైంటిస్టులు 17 నుంచి 19 ఏళ్ల మధ్య వయసుగల 2,084 మందిని తమ ఆధ్వర్యంలో ఉంచుకుని అబ్జర్వ్ చేశారు. వీరిలో సగం మంది తరచూ స్లిమ్ గా, ఫీట్గా అందమైన బాడీ ఇమేజె కలిగిన మోడల్స్ ఉండే ప్రకటనలు చూసేలా ముందుగానే మోటివేట్ చేశారు. అలాగే మిగతావారు సాధారణంగా స్లిమెంట్ ఫిట్నెస్, మోడల్స్ లేని ప్రకటనలు చూసేలా మోటివేట్ చేశారు. స్లిమ్ గా ఫీట్ గా ఉండే మోడల్స్ కలిగి ఉన్న యాడ్స చూస్తున్న టీనేజ్ గర్ల్స్, అలాగే సాధారణంగా స్లిమెంట్ ఫిట్నెస్, మోడల్స్ లేని ప్రకటనలు చూసే వారిని రెండు విభాగాలుగా డివైడ్ చేశారు.

వారిలో ఏ గ్రూపు వారిలో ఎటువంటి ఫీలింగ్స్ ఎక్కువగా డెవలప్ అయ్యాయో తెలుసుకోవడానికి కౌన్సిలింగ్ నిర్వహించారు. స్లిమ్ గా ఫీట్ గా ఉండే మోడల్స్ కలిగిన ప్రకటనలకు ప్రభావితమైన టీనేజ్ గర్ల్స్ తామ కూడా అటువంటి బాడీ ఇమేజింగ్ ను పొందాలని అత్యంత ఆసక్తి కలిగి ఉండడం గుర్తించారు. సన్నగా మోడల్స్ మాదిరి రొమ్ములు, బాక్ షీట్స్ కలిగి ఉండాలని ఉద్దేశంతో డైటింగ్, వ్యాయామం వంటివి చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. ఇక చాలామంది యాడ్స్ లోని మోడల్స్ తో తమను పోల్చుకుంటూ అలా లేనందుకు ఆత్మాన్యూనత భావానికి గురైనట్లు పరిశోధకులు తెలిపారు. కాబట్టి టీనేజ్ గర్ల్స్ ఎటువంటి ఇన్ఫినియారిటీ కాంప్లెక్స్ నుంచి దూరం చేసే విధానాలు అవసరమని సైకాలజిస్ట్‌ల అభిప్రాయం.